( టాగూర్ గీతాంజలి కి పేరడి - తెలుగు చలనచిత్ర జగత్తు నేపథ్యం లో ..సారీ.. టాలీవుడ్ బ్యాక్-డ్రాప్ లో ..)
ఎచ్చట ప్రెగ్నెన్సీ లో ఉన్న హీరో చెల్లి డొక్క లో విలన్ లు 'క్యిబా క్యిబా' అని తన్నరో..
ఎచ్చట హీరో డైరీ ని హీరోయిన్ క్లైమాక్సు కు ముందు మాత్రమే చదవదో..
ఎచ్చట పాకిస్తానీ తీవ్రవాదులు పరవస్తు చిన్నయసూరి కంటే స్పష్టమైన తెలుగు మాట్లాడరో..
ఎచ్చట డిగ్రీ కాలేజీ ఇన్స్పెక్షన్ కి డి.ఈ.వో. లు రారో..
ఎచ్చట పేషెంట్స్ కి 'కేన్సర్- లుకేమియా ' కాక వేరే జబ్బులు కూడా వస్తుంటాయో..
ఎచ్చట మరణగోగుల సంగీతం ఉండదో..
ఎచ్చట 'టెక్నికాలిటీ ' అంటే స్టడీకామేసుకుని సందుల్లో పరిగెత్తటం మాత్రమే కాదో..
ఎచ్చట 'నిర్-మాత ' అంటే తను తీసిన సినిమా ని 'అమ్మ-లేని ' వాడు అని అర్థం కాదో..
అట్టి స్వేచ్ఛామయ స్వర్గధామం లోకి ఈ టాలీవుడ్ ని నడిపించు తండ్రీ..!!
Tagore's original poem..
WHERE the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way Into the dreary desert sand of dead habit Where the mind is led forward by thee Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
సూపర్! 'నిర్మాత' శ్లేషను మాత్రం పేల్చారు. టాలీవుడ్ టాగోరు మీరే.:)
"ఎచ్చట పాకిస్తానీ తీవ్రవాదులు పరవస్తు చిన్నయసూరి కంటే స్పష్టమైన తెలుగు మాట్లాడరో.."
funny!
రానారె గారూ..
మీరు Tagore నేనేనంటే చిరంజీవి ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో ..
(:-
కొత్త పాళీ గారూ..
Thanks for your appreciation!!
:) హహ్హా.. బాగుంది..
awesome---
బాగుంది.
బ్లాగులెక్కువయ్యే కొద్దీ మిస్సయ్యేవీ ఎక్కువవుతున్నాయి.బాగా రాసావయ్యా బాసూ!
చాలా బావుంది. బాగా రాస్తున్నారు. ఇంకా రాయండి.
వెంకట్
Post a Comment