Tuesday, December 23, 2008

చిరు పై నా మిత్రుడి పుస్తకం: కెరటం

గిరిధర్ గోపాల్ రాజు అని, ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నాఫ్రెండ్. నిజానికి తను నాకు సీనియర్ అయినప్పటికీ, కూసింత కళా పోషణ మమ్మల్ని ఫ్రెండ్స్ ని చేసింది. కొన్ని స్కిట్స్ వగైరా నేను వ్రాసినవాటిని తను డైరెక్ట్ చేసాడు ఆ రోజుల్లో. సరే, ఈ "మరపు రావు కాలేజీ రోజులు" మాటలని కాస్త పక్కనపెట్టి విషయానికి వస్తే, గిరి కి మొదట నుంచీ కొంచెం కళాత్మకత,అంతకు మించి లైఫ్ లో ఏదైనా డిఫరెంట్ గా చేయలి అన్న తపన, ఈ రెండింటికి మించి చిరంజీవి మీద అభిమానం. సో, ఈ మూడు భిన్న ప్రవాహాలు వచ్చి ఒక త్రివేణీ సంగమం వద్ద కలిసి 'కెరటం' లా ఎగసి పడ్డాయనుకుంటా.

ఎవరి లైఫ్ లో వాళ్ళు,ఎవరి మెట్రో లో వాళ్ళు పడిపొవడం వల్ల గిరి ఈ పుస్తకం వ్రాయడానికి, దాన్ని పబ్లిష్ చేయించడానికి, రెండింటి కి మించి చిరంజీవి చేతుల మీదుగా నే ఈ పుస్తకం రిలీజ్ చేయించడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో,ఎంత స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలీదు కానీ -వూహించుకోగలను.

బేసిక్ గా ఈ పుస్తకం చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించే యువత భావాలని ప్రతిబింబించే పుస్తకం . ఈ పుస్తకం నేనింకా చదవలేదు.మీరు ఎవరయినా చదివి వుంటే, మీ అభిప్రాయాన్ని పంచుకుంటే సంతోషిస్తాను.




Saturday, May 10, 2008

ఆ పాత మధురాలు

మొన్న ఈమధ్య ఇంటికి వెళ్ళినప్పుడు మన పాత ట్రంకుపెట్టె తీస్తే బయటపడ్డాయి ఈ "ఆ పాత మధురాలు" . మిగిలినవి ఏమయ్యాయో బోధపడట్లేదు. సరే..ఉన్నవాటినైనా భద్రంగా భద్రపరుద్దామని ప్లస్ తోటి బ్లాగర్స్ తో పంచుకుందామని ఇక్కడ పోస్ట్ చేసా.ఎవరికైనా ఇది స్వోత్కర్ష లాగా అనిపిస్తే నా మీద విసుక్కోకుండా దయచేసి లైట్ తీసుకోండి..!

1. ఇది నేను తొమ్మిదో తరగతో పదో తరగతో చదివేటప్పటిది. ఆ రోజుల్లోనే మనం మణిరత్నం కి మాంఛి ఫ్యాన్ అన్నమాట. ఎవరో ఒకాయన మణిరత్నం ని విమర్శిస్తూ ఏదో ఆర్టికల్ వ్రాస్తే దానికి రిప్లయ్ గా మనం వ్రాసిన ఆర్టికల్ అన్నమాట ఇది. (ఆంధ్ర ప్రభ - 1994) (గమనిక: ఈ ఆర్టికల్ లో నేను వ్యక్తం చేసిన అభిప్రాయలు నా అప్పటి రోజుల అభిప్రాయాలు. వాటిలో కొన్ని అయితే ఇప్పటి నా అభిప్రాయాలకు పొంతన లేనివి కూడా వున్నాయి)


2. ఇది కూడ నేను 9 చదివే రోజుల్లోది. ఒక వ్యాసరచన పోటీ లో జిల్లా స్థాయి ప్రథమబహుమతి వస్తేనూ..(ఈనాడు 1994)


3. ఇంటర్ చదివేరోజుల్లో ఆంధ్రప్రభ లో ప్రచురితమైన ఒక ఉత్తరం చూసి..దానికి నా స్పందన..

4. ఇంటర్ రోజుల్లొ రాసిన రుక్కులు-


5. ఒక వ్యాసరచన పోటీ లో ఇంటర్ అప్పుడు ప్రైజ్ వస్తేనూ..

ఇలా అంటున్నానని కాదు కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి- స్కూల్, కాలేజ్ రోజుల్లో ఇలా అప్పుడప్పుడు పేపర్ లో పేరు చూసుకోవడం..అదొక మజా ఆ రోజుల్లో..!!!
అదండీ సంగతి..అలా జరిగిందప్పట్లో!