Saturday, May 10, 2008

ఆ పాత మధురాలు

మొన్న ఈమధ్య ఇంటికి వెళ్ళినప్పుడు మన పాత ట్రంకుపెట్టె తీస్తే బయటపడ్డాయి ఈ "ఆ పాత మధురాలు" . మిగిలినవి ఏమయ్యాయో బోధపడట్లేదు. సరే..ఉన్నవాటినైనా భద్రంగా భద్రపరుద్దామని ప్లస్ తోటి బ్లాగర్స్ తో పంచుకుందామని ఇక్కడ పోస్ట్ చేసా.ఎవరికైనా ఇది స్వోత్కర్ష లాగా అనిపిస్తే నా మీద విసుక్కోకుండా దయచేసి లైట్ తీసుకోండి..!

1. ఇది నేను తొమ్మిదో తరగతో పదో తరగతో చదివేటప్పటిది. ఆ రోజుల్లోనే మనం మణిరత్నం కి మాంఛి ఫ్యాన్ అన్నమాట. ఎవరో ఒకాయన మణిరత్నం ని విమర్శిస్తూ ఏదో ఆర్టికల్ వ్రాస్తే దానికి రిప్లయ్ గా మనం వ్రాసిన ఆర్టికల్ అన్నమాట ఇది. (ఆంధ్ర ప్రభ - 1994) (గమనిక: ఈ ఆర్టికల్ లో నేను వ్యక్తం చేసిన అభిప్రాయలు నా అప్పటి రోజుల అభిప్రాయాలు. వాటిలో కొన్ని అయితే ఇప్పటి నా అభిప్రాయాలకు పొంతన లేనివి కూడా వున్నాయి)


2. ఇది కూడ నేను 9 చదివే రోజుల్లోది. ఒక వ్యాసరచన పోటీ లో జిల్లా స్థాయి ప్రథమబహుమతి వస్తేనూ..(ఈనాడు 1994)


3. ఇంటర్ చదివేరోజుల్లో ఆంధ్రప్రభ లో ప్రచురితమైన ఒక ఉత్తరం చూసి..దానికి నా స్పందన..

4. ఇంటర్ రోజుల్లొ రాసిన రుక్కులు-


5. ఒక వ్యాసరచన పోటీ లో ఇంటర్ అప్పుడు ప్రైజ్ వస్తేనూ..

ఇలా అంటున్నానని కాదు కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి- స్కూల్, కాలేజ్ రోజుల్లో ఇలా అప్పుడప్పుడు పేపర్ లో పేరు చూసుకోవడం..అదొక మజా ఆ రోజుల్లో..!!!
అదండీ సంగతి..అలా జరిగిందప్పట్లో!

6 comments:

Anonymous said...

అభినందనలు. అలాంటివి నిజంగానే మధుర జ్ఞాపకాలు. వాటిని చదివేటట్లు మాకందించి ఉంటే ఇంకా బాగుండేది. లేదా టైప్ అయినా చేయాల్సింది.

సుజాత వేల్పూరి said...

బట్టల పెట్లో దాచిన మొగలి రేకుల్లాగా, కర్పూరపు దండల్లాగా సువాసనలు వెదజల్లుతాయి చిన్ననాటి జ్ఞాపకాలు. జీవితంలో అప్పుడప్పుడు refreshment కావాలంటే వాటిని నెమరేసుకుంటుండాలి. బాగున్నాయి మీ ఆపాత మధురాలు.

mohanrazz said...

సుజాత గారూ..
కృతఙ్ఞతలు.

నువ్వుశెట్టి గారూ.స్కాన్ చేసిన పేపర్ మీద క్లిక్ చేస్తే చదివేగలిగేంత పెద్ద అక్షరాలతో ఓపన్ అవుతుంది.కృతఙ్ఞతలు.

Unknown said...

wow. adoni, yemmiganur ku sambadinchina vaartala clippulu choosi santoshapaddanu. Nenu AAS college lone chadivaanu.

Anonymous said...

ఓ సారీ. అజ్ఞానిని అర్ధం చేసుకోలేక పోయాను. థ్యాంక్స్.

Prashanth said...

these are really superb mohanraj,
we enjoyyed a lotttt