ఐ.టి. లో పనిచేసే కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ ని చూసాక సరదా గా వ్రాసింది...
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!
ఏంట్రా ఈ జీవితం అంటాడు,
వేస్ట్ లైఫ్ రా మనది అంటాడు,
ఐ.టి లో నో, ఐ.ఐ.టి లో నో ఉంటాడు !!
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!
'మనం వేస్ట్ రా బాబూ..' అంటాడు,
మనకి లైఫ్ ప్లానింగ్ అస్సలు చేతకాదంటాడు,
ఊరిలో వంద ఎకరాలు కొంటాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!
'అమ్మాయిలొద్దురా బాబూ - టార్చర్ ఫెలోస్' అంటాడు
అయినా మనకెందుకు రా అమ్మాయిలు అంటాడు
రాత్రి మినిమమ్ రెండు గంటలు సెల్ లో 'సొల్లు'తాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!
ఫ్రెండ్ ఫొన్ చేస్తే, ఐ.టి. లోకి రావద్దంటాడు
వర్క్ లోడ్ ఎక్కువంటాడు - జాబ్ సెక్యూరిటి తక్కువంటాడు
వచ్చావంటే నీ లైఫ్ 'ఖండం అయిపొద్ది' అంటాడు
వీడేమో ఆన్ సైట్, H1 తప్ప వేరే ఏమీ ఆలోచించడు!!
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!
'ఎదవ జీవితం ' - పెళ్ళి కూడా కావట్లేదంటాడు
అమ్మాయి దొరకట్లేదంటాడు - అయినా మనకెవడిస్తాడంటాడు
ఇంట్లో వాళ్ళు 'మ్యాచ్' చూపిస్తే ఫ్లాట్, కార్ కొన్నాకే పెళ్ళి అంటాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!
నేను 'కూల్-డ్యూడ్' ని అంటాడు
నేను జాలి క్యాండిడేట్ అంటాడు
పని ఒక్కటే లైఫ్ కాదంటాడు
ఉదయం 8 కి ఆఫీస్ కి పోతే రాత్రి 11 అయినా బయటికి కదలడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని! !!
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
అదరగొట్టావ్ గురూ, కానీ అలా కేవలం ఒక్క తెలుగు వాడే చేయడం లేదు. ఆ మాటకొస్తే భారతదేశం లో అందరూ అలానే చేస్తున్నారు.
బావుంది!
ha ha ha, chaalaa baagaa raasaaru !!
hahaha, baagaa raasaaru !!
హ హ హ్హ...నేను మీ మాటలు నమ్మట్లేదులెండి.
chaalaa baagudi
Post a Comment