సినిమా వాళ్ళ తెలుగు, మనం మామూలు గా మాట్లాడుకునే తెలుగు రెండూ ఒకటేనన్న పెద్ద అపోహ లో వుంటారు చాలామంది. చాలా పొరపాటది. దానికీ దీనికీ రాధిక కి సాధిక కి ఉన్నంత తేడా ఉంది. సినిమా వాళ్ళు మాట్లాడే మాటల వెనుక వుండే అసలు అర్థం తెలియాలంటే కొంచెం జాగ్రత్త గా పరిశీలించాలి.
ఉదాహరణకి సినిమా వాళ్ళు ప్రెస్ మీట్ లో, ఇంటర్వ్యూ లో మాట్లాడే కొన్ని సినిమా తెలుగు మాటలని సాధారణ తెలుగు లోకి డబ్బింగ్ చేస్తే సారీ ట్రాన్స్ లేట్ చేస్తే ఇలా ఉంటాయి. (సినిమా వాళ్ళ తెలుగు ని, దాని ప్రక్కనే తెలుగు లో ఆ వాక్యం అసలు మీనింగ్ ని గమనించగలరు)
ప్రెస్ మీట్ - సినిమా మొదలెట్టే మందు:
కథే హీరో - హీరో గా ముక్కూ మొఖం(లేని)తెలీని సన్నాసిగాణ్ణి పెట్టాం.
ఈ సబ్జెక్ట్ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు - ఈ సారి ఎవరికి తెలీని ఇరాన్ సినిమా ని కాపీ కొట్టాం.
పక్కా స్క్రిప్ట్ తో మొదలెడుతున్నాం - స్టోరీ లైన్ రెడీ అయింది
ప్రెస్ మీట్ - సినిమా రిలీజ్ కి ముందు:
మా డైరెక్టర్ మేమనుకున్న దాని కంటే బాగా తీసాడు - వీడు ఈ మాత్రం తీస్తాడని అనుకోలేదు ముందు.
స్క్రీన్ ప్లే చాల ఫాస్ట్ గా వుంటుంది - పెద్ద స్టోరీ ఏమీ ఉండదు.
రీమేకే అయినా నేటివిటి మార్పులు చాలా చేసాం - ఫస్ట్ సాంగ్ మూడో స్టెప్ లో హీరో లుంగీ కి బదులు ప్యాంట్ వేసుకుంటాడు.
రిలీజ్ అయ్యాక -
మొదట్లో డివైడెడ్ టాక్ వినిపించింది - ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన వాళ్ళు బండబూతులు తిట్టారు.
స్లో గా పికప్ అవుతోంది- కౌంటర్ లో ఈగలు తోలుకుంటున్నారు.
సినిమా చూసిన వాళ్ళంతా టెక్నికల్ గా చాలా బాగుందంటున్నారు - సినిమా ఓవరాల్ గా ఛండాలంగా వుందంటున్నారు.
సినిమా విశ్లేషకుల అంచనాలను తలకిందలు చేసి, ట్రేడ్ పండితులని ఆశ్చర్యపరిచింది- చెత్త సినిమా నే, కానీ (అక్కడక్కడా) ఆడుతోంది, ఎందుకో తెలీదు.
9 comments:
బాగా రాసారు. చప్పట్లు! డిఫరెంట్ పాత్ర లాంటివి ఇంకా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా రాయండి. అలాగే టీవీ చానెళ్ళు ఎలా చెబుతాయో కూడా.
Hilarious! Dishout more!!
బావున్నాయి. ఇంకా చాలా రాయచ్చనుకుంటాను, రాయండి..ఉ.'కథ పాతదే అయినా ట్రీట్మెంటు డిఫరెంటు'
బాగుంది మీ కామెడీ! :-)
ha ha ha super
ha baaraasaaru
meeeru
mee taking baavundi
thanks for ur comment in my blog
good one!
superb man
Post a Comment